ఈ జీఎస్టీతో చిన్న వ్యాపారులకు తీవ్ర నష్టం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం. ఇది అసలైన జీఎస్టీ కాదన్నారు. నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం ఈ జీఎస్‌టీ లేదని, కచ్చితంగా ద్రవ్యోల్బణంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులంతా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు చిదంబరం. తాము అధికారంలో ఉన్నప్పుడు జీఎస్టీ ప్రక్రియను ప్రారంభించామని, అప్పుడు ఇదే బీజేపీ పూర్తిగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఎన్డీయే అమలు చేస్తున్న జీఎస్టీ వల్ల సంవత్సరానికి 37 సార్లు ట్యాక్స్ రిటర్న్స్  ఫైల్ చేయాల్సి వస్తుందని చిదంబరం వివరించారు.