ఇద్దరు డ్రగ్స్ సప్లయర్ల అరెస్ట్

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాలపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ మాఫియాను కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ వాసి మహ్మద్ జీషన్‌ అలీఖాన్ అలియాస్ జాన్, నైజీరియన్ బెర్నార్డ్ విలియమ్స్ ఇద్దరూ కొన్నాళ్లుగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వీరిద్దరి దగ్గర్నుంచి 12 గ్రాముల కొకైన్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాల్ డేటా ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని వివరించారు.