ఆ మూవీ కోసం బ‌రువు త‌గ్గుతున్నా!

మ‌హాన‌టి సావిత్రి జీవిత‌నేప‌థ్యంలో ఓ మూవీ తెరకెక్కుతున్నది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించ‌నుండ‌గా, స‌మంత జ‌ర్న‌లిస్ట్ గా క‌నిపించ‌నుంద‌ట‌. ఇక జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించనున్నాడు. అయితే కొద్ది రోజులుగా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ బ‌రువు పెరుగుతుంద‌ని ప‌లు వార్తలు వ‌చ్చాయి. దీనిపై ఈ అమ్మ‌డు తాజాగా క్లారిటీ ఇచ్చింది. త‌న బ‌రువు విష‌యంలో వ‌చ్చిన వార్త‌ల‌న్నీ అవాస్త‌వం. ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబోలో రూపొందుతున్న సినిమా కోసం బ‌రువు త‌గ్గుతున్నాను. మ‌హ‌న‌టి సినిమాలో సావిత్రిలా క‌నిపించేందుకు ప్రోస్థ‌టిక్ మేక‌ప్ వాడ‌తాం అంటూ వివ‌ర‌ణ ఇచ్చింది. త‌క్కువ టైంలో ఎక్కువ ఆఫ‌ర్స్ అందుకుంటున్న కీర్తి సురేష్ సూర్య‌, విక్ర‌మ్ , విశాల్ సినిమాల‌లో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.