ఆల్ టైం హై లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్‌  టైం రికార్డును సృష్టించాయి. గత కొన్నిసెషన్లుగా జోరుమీద ఉన్న సూచీలు ఇవాళ రికార్డుస్థాయిలో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్‌ 200లకు పైగా పాయింట్ల లాభంతో 32వేల మార్కును క్రాస్‌ చేయగా… ఇటు నిఫ్టీ సైతం 60 పాయింట్ల లాభంతో 9,868 దగ్గర ట్రేడవుతోంది. గత నెలలో ద్రవ్యోల్బణం 1. 54 శాతానికి పడిపోయిందన్న ప్రభుత్వ అంచనాలతో సెన్సెక్స్ పరుగులు పెట్టింది. అటు ఆర్బీఐ త‌న త‌ర్వాతి సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించనుందన్న వార్తలు కూడా మార్కెట్‌ కు కలిసి వచ్చాయి.