ఆత్మహత్యాయత్నం వార్తలు అవాస్తవం!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ పేరు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. కొత్త బంగారు లోకం చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరుణ్ సందేశ్ ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం వితిక శేరుని పెళ్లి చేసుకున్నాడు. డిసెంబర్7, 2015లో వీరిద్దరి నిశ్చితార్ధం జరగగా.. ఆగస్ట్ 8,2016 న ఆలంకృత రిసార్ట్స్ లో వరుణ్, వితికల పెళ్ళి గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే పెళ్ళి తర్వాత కొద్ది రోజులు అమెరికాలో ఉండొచ్చిన దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. గత రాత్రి వరుణ్ భార్య, నటి వితిక షేరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, కుటుంబ కలహాల కారణంగానే ఆమె అలాంటి నిర్ణయం తీసుకుందని జోరుగా ప్రచారం జరిగింది. చికిత్స పొందుతున్నట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో వితిక తన ట్విట్టర్ ద్వారా రూమర్స్ కి బ్రేక్ వేసింది. మాపై వస్తున్న న్యూస్ అన్ని ఫేక్ . మేం సంతోషంగా ఉన్నాం. పుకార్లను నమ్మొద్దని వితిక ట్వీట్ చేసింది.