అవకతవకలకు పాల్పడితే సహించం

భూములు రిజిస్ర్టేషన్‌లో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు డిప్యూటీ సిఎం మహమూద్‌ అలీ. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆయన అకస్మిక తనిఖీ చేశారు. రికార్డ్స్‌ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, కొందరు అధికారులు అవినీతికి పాల్పడి అందరికి చెడ్డపేరు తెచ్చారని మహమూద్ అలీ అన్నారు. మియాపూర్ భూముల రిజిస్ట్రేషన్ లో అక్రమాలు మినహా రాష్ట్రంలో ఎక్కడా అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. టీఎన్జీవోస్ కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపడతామని ప్రకటించారు. రాజేంద్రనగర్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నారు.