అలా చెప్పడం నా తప్పే!

శివగామి పాత్ర కోసం తొలుత శ్రీదేవిని సంప్రదించామని, అయితే ఆమె డిమాండ్‌లను ఒప్పుకోలేక ఆ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నామని ఇటీవల దర్శకుడు రాజమౌళి తెలిపారు. అయితే తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని, నేను రాజమౌళిని ఎటువంటి డిమాండ్‌లు చేయలేదని ఇటీవల మామ్ చిత్ర ప్రచారం సందర్భంలో శ్రీదేవి చెప్పింది. దీనిపై తాజాగా దర్శకుడు రాజమౌళి స్పందించారు. శ్రీదేవి అంశాన్ని నేను బహిరంగ వేదికపై చర్చించకుండా వుండాల్సింది. అది నా తప్పే. అందుకు చింతిస్తున్నాను. అయితే భిన్నవాదనలు వినిపిస్తున్న సమయంలో ఎవరు చెబుతున్నది నిజమో ప్రజలే నిర్ణయించుకుంటారు. శ్రీదేవి అంటే నాకు అపారమైన గౌరవం వుంది. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారని ఆయన తెలిపారు.