అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు

అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టించి ఇస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం శాంతినగర్‌ లో 20 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్‌పర్సన్ కవిత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. డబుల్ బెడ్‌ రూం ఇల్లు కల నెరవేరిందని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.