అర్చకులు, ఆల‌య ఉద్యోగుల వేతనాలపై వారంలో నివేదిక

అర్చకులు, ఆల‌య ఉద్యోగుల వేత‌నాల‌పై ఏర్పాటు చేసిన మంత్రివ‌ర్గ ఉప సంఘం స‌భ్యులు మంత్రులు ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి హైదరాబాద్ లోని ప్రగ‌తి భ‌వ‌న్లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. క్యాబినెట్ స‌బ్ క‌మిటీ నివేదికలోని అంశాల‌ను ముఖ్యమంత్రి మంత్రుల‌ను అడిగి తెలుసుకున్నారు. వ‌చ్చే వారంలోగా త‌న‌కు నివేదిక అంద‌జేయాల‌ని సీఎం కేసీఆర్ క్యాబినెట్ స‌బ్ క‌మిటీకి సూచించారు. క్యాబినెట్ స‌బ్ కమిటీ నివేదిక అంద‌రికి అందుబాటులో ఉండేలా అద‌న‌పు ప్రతుల‌ను సిద్ధం చేయాల‌ని సీఎం కేసీఆర్ దేవాదాయ శాఖ కార్యద‌ర్శి శివ‌శంక‌ర్ ను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేర‌కు వ‌చ్చే వారంలోగా దేవాదాయ శాఖకు సంబంధించి క్యాబినెట్ స‌బ్ క‌మిటీ చ‌ర్చించిన అంశాల‌పై స‌మ‌గ్రమైన నివేదిక‌ను సీఎం కేసీఆర్ కు అంద‌జేస్తామ‌ని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. నివేదిక అందిన వెంట‌నే అర్చకులు, ఆల‌య ఉద్యోగుల వేత‌నాలతో పాటు వివిధ అంశాల‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటార‌ని చెప్పారు.