అమ్మవారి దయతో మంచి వర్షాలు

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దయతో వర్షాలు బాగా కురుస్తున్నాయని  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. లష్కర్ బోనాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అమ్మవారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తున్నారని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అన్ని డిపార్ట్‌మెంట్ల సమన్వయంతో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నమన్నారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం గొప్ప విషయమన్నారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాక భక్తుల సంఖ్య బాగా పెరిగిందని చెప్పారు. విజయవాడ, ఢిల్లీలో సైతం బోనాల పండుగను ఘనంగా జరుపుతున్నమని తలసాని తెలిపారు.