అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భువనగిరి వాసి దుర్మరణం

అమెరికాలోని నార్త్ కరోలినాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లోయలో పడటంతో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు భవనగిరికి చెందిన సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ పోత్నాక్‌ ప్రదీప్  గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతుడు ప్రదీప్‌  కు ఆరునెలల క్రితమే వివాహమైంది. బర్త్‌  డే వేడుకలు జరుపుకొని వస్తుండగా ప్రమాదం సంభవించింది.