అమర్ నాథ్ యాత్రలో విషాదం

అమర్ నాథ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది.  యాత్రకు వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా…..35 మందికి గాయాలయ్యాయి. రామ్ బన్ ప్రాంతంలో జమ్మూ-శ్రీనగర్ హైవేపై ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ…సహాయక చర్యలు ప్రారంభించింది. గాయపడ్డవారిని అంబులెన్స్ ల ద్వారా ఆస్పత్రికి తరలించింది.