అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం

జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ లో ఉగ్రవాదుల దాడికి గురైన బస్సు డ్రైవర్ సలీం సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో సలీం గాయపడ్డప్పటికీ….. రెండు కిలోమీటర్ల వరకు బస్సును నడిపి 50 మంది యాత్రికుల ప్రాణాలు కాపాడారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను వదలకూడదన్న సలీం…. తనను నమ్మి వచ్చిన వారి ప్రాణాలు కాపాడాలనే సంకల్పమే తనతో బస్సును నడిపించిందన్నారు. 50 మంది ప్రాణాలు కాపాడినందుకు గర్వంగా ఉన్నప్పటికీ… మరో ఏడుగురి ప్రాణాలు కాపాడలేకపోయాననే బాధ ఉందన్నారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన సలీంను గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రశంసించారు.