అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి చందూలాల్

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో మంత్రి చందూలాల్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాజుపేట, రమణక్కపేట, చుంచుపల్లి, మల్లూరు, బుచ్చంపేట, బోరునర్సాపురం  గ్రామాల్లో పంచాయితీ  భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చుంచుపల్లిలో కస్తూర్భా బాలికల పాఠశాలకు భూమి పూజ నిర్వహించారు. అబ్బాయిగూడెంలో బీటీ రోడ్డు పనులకు.. బుచ్చంపేట, గంపోనిగూడెం, పొదుమూరు గ్రామాల్లో సీసీ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు మంత్రి చందూలాల్‌.