అన్నివర్గాలు ఆత్మగౌరవంతో బతకాలి

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి జూపల్లి అన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నర్సప్పగూడలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా షాద్ నగర్ నియోజకవర్గానికి నీళ్లిస్తామని జూపల్లి చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటామన్నారు.