అనుష్కయే లీడింగ్ లేడీ!

ప్రభాస్-అనుష్క జంట ఎవర్‌గ్రీన్ జంటగా నిలిచిపోయింది. అప్పట్లో ఎన్టీఆర్-శ్రీదేవి ఎలాగో ఇప్పుడు ప్రభాస్-అనుష్క అంతటి పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటికే దాదాపు నాలుగు సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. తాజా మరో సినిమాలో అలరించబోతోంది. యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అనుష్క.. ఇలా పలువురి పేర్లు వినిపించినా చిత్ర యూనిట్ అయితే ఇప్పటి వరకు ఎవరినీ నిర్ధారించలేదు. తమిళ సినీ ప్రముఖుడైన రమేష్ బాలా సాహో చిత్రంలో హీరోయిన్‌గా అనుష్క కన్ఫర్మ్ అయినట్టు కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సాహో సినిమాలో అనుష్కయే ‘లీడింగ్ లేడీ’ అని రమేష్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ విషయంపై యూవీ క్రియేషన్స్ కానీ, చిత్ర సభ్యులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.