అఖిలపక్షంతో కేంద్రమంత్రుల భేటి

ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పాక్, చైనా సరిహద్దులలో పరిస్థితులు, కాశ్మీర్ లో శాంతిభద్రతలపై అఖిలపక్ష నాయకులతో చర్చిస్తున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి, ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్, ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టీడీపీ నేతలు సుజనాచౌదరి, తోట నరసింహం, టీఎంసీ నేత డెరక్ ఓబ్రైన్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.