అంటార్కిటికాలో మరో పెనుమార్పు

అంటార్కిటికాలో మరో పెనుమార్పు చోటు చేసుకుంది. మునుపెన్నడూ లేనంత భారీ పరిమాణంలోని ఐస్‌బర్గ్‌ బద్దలైంది. దాదాపు 5800 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణం కలిగిన లార్సెన్‌ సీ అనే మంచుపలక ఎట్టకేలకు ప్రధాన విభాగం నుంచి విడిపోయినట్లు స్వాన్సియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని బరువు ట్రిలియన్‌ టన్నులు ఉంటుందని అంచనా. ఈ ఐస్‌బర్గ్‌ అమెరికాలోని డెలావర్‌ అనే చిన్నరాష్ట్రం విస్తీర్ణంతో సమానం.  ఇప్పటికే ప్రధాన విభాగం నుంచి విడిపోయిన ఈ భారీ మంచు కొండ అప్పుడే కరగడం ప్రారంభించిందని, అది 12 శాతం తగ్గిందని, ఫలితంగా దీనికి సమీపంలోని సరస్సుల్లో ప్రవాహం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.