99 శాతం నాలాలు క్లియర్ చేశాం

హైదరాబాద్ లోని వర్ష ప్రభావిత ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి సహాయచర్యలను పర్యవేక్షించారు. గంటలో 5 సెంటీమీటర్ల  వర్షపాతం కురిసిన కారణంగా నగరంలోని పలు నాలాల్లో నీరు నిలిచిపోయిందని ఆయన తెలిపారు. మ్యాన్‌హోల్స్‌లో ప్లాస్టిక్, చెత్త పేరుకుపోవడంతో నీరు ఆగిపోయిందని చెప్పారు. కాగా ఇప్పటికే 99 శాతం నాలాలను క్లియర్ చేసినట్లు వెల్లడించారు. మ్యాన్‌హోల్స్‌లోని చెత్తను సైతం తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  హైదరాబాద్‌  ప్రజలు కూడా తమ ఇంటి దగ్గరలో ఉన్న మ్యాన్‌హోల్స్ వద్ద చెత్తను, ప్లాస్టిక్‌లను తొలగించాల్సిందిగా కోరారు.