9 ఆలయాల పాలకమండళ్ల ప్రమాణం

కరీంనగర్ జిల్లా కేంద్రంలో దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న తొమ్మిది ఆలయాలకు తెలంగాణ సర్కార్ నూతన పాలక మండళ్లను నియమించింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు ముఖ్య అతిథులుగా హాజరై సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఅర్ కృషి చేస్తున్నారని చెప్పారు.