71 వ వసంతంలోకి ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 71 వ వసంతంలోకి అడుగుపెట్టారు. అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయన తొలిసారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. వైట్‌ హౌజ్ లో అధ్యక్షుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు. అటు ఢిల్లీలో హిందూసేన ట్రంప్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించింది. కేక్‌ కట్ చేసి ట్రంప్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.