300 వన్డేల క్లబ్‌లోకి యూవీ!

టీమ్‌ఇండియా స్టైలిష్‌ ప్లేయర్ యువరాజ్ సింగ్‌ 300 వన్డేల క్లబ్‌లో చోటు దక్కించుకోనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో యివాళ బంగ్లాదేశ్‌తో జరిగే సెమీఫైనల్‌ యువీ కెరీర్‌లో 300వ మ్యాచ్‌. దీంతో వన్డే కెరీర్‌లో 300 మ్యాచ్‌లు ఆడిన అజారుద్దీన్, సచిన్, గంగూలీ, ద్రవిడ్‌ సరసన యువరాజ్‌ నిలవనున్నాడు. బంగ్లాతో జరిగే 300వ మ్యాచ్‌లో సత్తా చాటాలిన యువరాజ్ పట్టుదలగా ఉన్నాడు.