30న జీఎస్టీ ప్రత్యేక సమావేశం

ముందుగా అనుకున్నట్లుగానే వచ్చే నెల (జులై) 1 నుంచి జీఎస్టీ అమలు చేయనున్నట్లు చెప్పారు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు జీఎస్టీని ఆమోదించాయని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా 81 శాతానికి పైగా పూర్తయిందని వెల్లడించారు. ఈ నెల (జూన్) 30 న జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. అదే రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అర్ధరాత్రి ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా జీఎస్టీని ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, ప్రధాని, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, మాజీ ప్రధానులు, రాష్ట్రాల సీఎంలు, ఆర్ధిక మంత్రులు, హాజరవుతారని చెప్పారు జైట్లీ.