24 గంటల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షం

రానున్న 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అండమాన్ ను ఆనుకొని ఉపరితల ఆవర్తన ద్రోణి ఆవరించి ఉందని తెలిపింది. దాని ప్రభావంతోనే నిన్న పలుచోట్ల వర్షాలు కురిశాయని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు చెప్పారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపారు.