24 గంటల్లో మోస్తరు వర్షం

నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. మరోవైపు, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి ఉంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.