20 ఏళ్ళ సంప్రదాయానికి ట్రంప్ బ్రేక్  

అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ముస్లింల ముఖ్యమైన పండుగ రంజాన్ రోజున వారిని తీవ్ర నిరాశకు గురిచేశారు. ప్రతి ఏటా రంజాన్ రోజున అధ్యక్ష భవనంలో ముస్లిం ప్రముఖులకు ఇచ్చే ప్రత్యేక విందుకు స్వస్తి పలికారు. ముస్లింలకు శుభాకాంక్షలంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ ద్వారా ఒక ప్రకటన మాత్రం చేయించి సరిపెట్టారు. గతంలో ఇస్లామిక్ దేశాలపై యుద్ధం చేసిన రిపబ్లికన్ పార్టీ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ సైతం తన హయాంలో ఈ విందును ఆపలేదు. 200 ఏళ్ళ కిందట థామస్‌ జెఫర్‌సన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదలైన ఈ సంప్రదాయం గత 20 ఏళ్ళుగా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ హయాంలో ఇప్పుడు బ్రేక్ పడింది.