191 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్

ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో టీమిండియా సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్లు ఇరగదీశాడు. సౌతాఫ్రికాను 44.3 ఓవర్లలోనే 191 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్‌ చేశారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు ఆమ్లా, డీకాక్‌ 76 పరుగుల శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత నుంచి భారత బౌలర్ల జోరు కొనసాగింది. భువనేశ్వర్‌, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను 200 పరుగులలోపే కట్టడిచేశారు. జడేజా, అశ్విన్, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. భారత ఫీల్డర్లు పాదరసంలా కదులుతూ మూడు రనౌట్లు చేశారు. సౌతాఫ్రికా జట్టులో డీకాక్‌ 53 రన్స్‌ తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.