160 డబుల్ బెడ్ రూం ఇళ్లకు భూమిపూజ

పేదల కళ్లల్లో ఆనందం చూసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమైనట్లు అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. సికింద్రాబాద్‌ బన్సీలాల్ పేటలోని పొట్టి శ్రీరాములు నగర్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. త్వరలోనే 160 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇస్తామన్నారు తలసాని.

దేశ చరిత్రలోనే మొదటిసారి స్మశానంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నారు. బొందలగడ్డలో ఇళ్ల నిర్మాణం ఏంటని మొదట కొందరు అభ్యంతరం చెప్పినా.. స్థానికులు కోరడంతో ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తలసాని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.