16 నుంచి ఒరుగల్లు కళా వైభవ ఉత్సవాలు

జూన్ 16 నుండి 18 వరకు ఓరుగల్లు కళా వైభవ ఉత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రముఖ రైటర్స్ తో హరితహోటల్ లో మూడు రోజులు ఉత్సవాలు ఉంటాయన్నారు. ఫిల్ ఫిస్టెవెల్ 18 కేయూ ఆడిటోరియంలో ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్  మాట్లడుతూ.. కాకతీయ కళావైభవం మూడు రోజులు ఉంటుందని, ఈ కార్యక్రమనికి టూరిజం శాఖమంత్రి చందులాల్ వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ తర్వాత చాలా కార్యక్రమాలు వరంగల్ లో జరుగుతున్నాయన్నారు. వరంగల్ కు రెండువేల యేళ్ల చరిత్ర వుందన్నారు మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లడుతూ..  మూడు రోజుల కార్యక్రమంలో యువతకు, ప్రజలకు కాకతీయుల వైభవాన్ని తెలియాజేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.  ప్రజలు అందరు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు.