14న సినారె అంత్యక్రియలు

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో సినారె అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. సినారె మనవడు విదేశాల నుంచి రావాల్సి ఉన్నందున..  కుటుంబసభ్యుల కోరిక మేరకు  బుధవారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయన్నారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.