హోరాహోరీ త‌ప్ప‌దు

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జ‌రిగే ఫైన‌ల్లో హోరాహోరీ త‌ప్ప‌దని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. లండన్ లో ఆయన మీడియాతో మాట్లాడాడు. ఫైన‌ల్ మ్యాచ్ కోసం ప్లేయ‌ర్లు అంద‌రూ ఆత్రుత‌గా ఉన్నార‌న్నాడు. పాకిస్థాన్‌తో ఆడేందు‌కు తమ‌కు ఎలాంటి భ‌యంలేద‌ని, అలాగే దురుసుగా వ్య‌వ‌హ‌రించేందుకు కూడా తాము సిద్ధంగా లేమ‌న్నాడు. కీల‌క‌మైన మ్యాచ్‌లో స‌మ‌తుల్యంగా ఉండ‌డం ముఖ్య‌మ‌ని చెప్పాడు. రెండు జ‌ట్లు క‌ప్‌ను గెల‌వాల‌న్న త‌ప‌న‌తో ఉన్నాయ‌ని, ఫైన‌ల్‌కు చేరేందుకు తాము చాలా కృషి చేశామని అ‌న్నాడు. ప్ర‌తి ప్లేయ‌ర్ వంద శాతం త‌మ ఆట‌ను ప్ర‌ద‌ర్శించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, రెండు జ‌ట్ల ఆట‌గాళ్లు ఆ స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శిస్తే, ఇక మ్యాచ్ ఉత్కంఠగా ఉంటుంద‌న్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని చెప్పాడు.

ఈ సందర్భంగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ క‌ప్‌ను కెప్టెన్లు కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్‌లు మీడియా ముందు ప్ర‌ద‌ర్శించారు. కోహ్లీ తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ కూడా మీడియాతో మాట్లాడాడు.