హైదరాబాద్‌లో భారీ జువెలరీ ఎక్స్ పో!

హైదరాబాద్‌ నగరంలో అతి పెద్ద బీ2బీ జువెలరీ ఎక్స్ పో ప్రారంభమైంది. హైద్రాబాద్ జువెలరీ పెరల్ అండ్ జెమ్ ఫెర్ 10వ ఎడిషన్ నోవెటల్ హోటల్ లో ఘనంగా లాంచ్‌ అయింది. గత తొమ్మిదేళ్లుగా యూబిఎమ్ సంస్థ నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోకు దేశీయ బంగారం వ్యాపారులతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన జువెలరీ ఎగ్జిబీటర్స్ తమ లేటెస్ట్ జువెలరీస్ ను ప్రదర్శిస్తున్నారు. మార్కెట్ కాపింటీషన్ కు తగ్గట్టుగా ఈ ఎక్స్ పోలో డిజైనర్ గోల్డ్ జువెలరీ, డైమెండ్ నెక్లెస్ లు, ముత్యాల హారాలు, బిగ్ సైజ్ జువెలరీ పెండెంట్స్, టెంపుల్ జువెలరీ, అన్ కట్ డైమెండ్ ఆభరణాలు, సింపుల్ చైన్స్, బ్రేస్ లెట్స్, బ్యాంగిల్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఎక్స్ పోలో సిల్వర్ ఇమిటేషన్ ఆభరణాలు స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. గోల్డ్ కు ఏమాత్రం తీసిపోకుండా సిల్వర్ తో కలెక్షన్ ను గోల్డ్ కోటెడ్ తో జువెలరీని రూపొందించారు. పెద్ద ఇయర్ రింగ్స్, పెద్ద నెక్లెస్‌ లు అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే అంత వెయిట్ ని ఇష్టపడని వాళ్లకు , అలాగే తక్కువ బడ్జెట్ లో హెవీగా కనిపించాలనుకునే వారికి లైట్ వెయిట్ జువెలరీ, బెస్ట్ చాయిస్ గా మారింది. అందుకే వ్యాపారులు కస్టమర్లను ఆకర్షించడానికి ఈ లైట్ వెయిట్ ట్రెండ్ ను పరిచయం చేస్తున్నారు. ఈ ఎక్స్ పోలో కంటెపరరీ జువెలరీకి పెద్ద పీట వేశారు వ్యాపారులు. అలాగే ప్యూర్ గోల్డ్ తో లైట్ వేట్ తో చేసిన జువెలరీకి ఇప్పుడు క్రేజ్ పెరిగిందంటున్నారు కేరళ వ్యాపారులు.

ప్రస్తుతం గోల్డ్ , డైమండ్స్, ప్రీషియస్ స్టోన్స్ పై 3శాతం జీఎస్టీ అమలను ఆహ్వానిస్తున్నట్టు యూబిఎమ్ ఆర్గనైజర్స్ చెబతున్నారు. జీఎస్టీ వల్ల విదేశీ,స్వదేశీ గోల్డ్ అమ్మకాలు పెరుగుతాయంటున్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌ పోలో దాదాపు 150కి పైగా బ్రాండ్లతో పాటు టోకు వ్యాపారులు, రిటైలర్లు, ఎగుమతి దారులు, దిగుమతి దారులు, డైమండ్, జెమ్ స్టోన్ సరఫరా దారులు.. వ్యాపార, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.  కేవలం బిజినెస్ పీపుల్, రీటైలర్స్ మాత్రమే కొనుగోలు చేసే విధంగా ఈ ఎక్స్ పోను ఏర్పాటు చేశారు.