హీరోయిన్ గాసానియా మీర్జా..?

టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది . ఎందుకంటే తాజాగా ఫరాన్ అక్తర్ విషయం వెలుగులోకి తెచ్చాడు . హైదారాబాది అయిన సానియా మీర్జా ని తెలుగు సినిమాల్లో నటింప జేయడానికి అప్పట్లో ప్రయత్నాలు చేసారు కానీ కుదరలేదు అయితే పలు యాడ్ లలో నటించింది అలాగే సందేశాత్మక షార్ట్ ఫిలిం కూడా చేసిందికానీ మొట్టమొదటి సారిగా వెండితెర పై నటించడానికి రంగం సిద్దం చేసుకుంటో౦దట . మరో విశేషం ఏంటంటే సినిమాలో ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా కూడా కీలక పాత్రలో నటించనున్నాడట . సానియా మీర్జా కూడా బాలీవుడ్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది . త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం