హిమాలయాలపై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను హిమాలయాలపై ఘనంగా నిర్వహించేందుకు ఏసీటీఎస్  బృందం అక్కడికి చేరుకుంది. దాదాపు మూడు రోజులు కాలినడకన గంగోత్రి నుంచి మౌంట్ రుదుగైరా అడ్వాన్స్ సమ్మిట్ క్యాంప్ కు చేరుకున్నారు. మీడియా చరిత్రలో తొలిసారి టి న్యూస్ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. హిమాలయాల్లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కవర్ చేసేందుకు టి న్యూస్ బృందం అక్కడికి వెళ్లింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హిమాలయాల వేదికగా ఏసీటీఎస్ బృందం నేతన్నకు భరోసా కల్పించే సందేశాన్ని ఇవ్వనున్నారు. వారానికి ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరించాలన్న మంత్రి కేటీఆర్ సందేశాన్ని హిమాలయాల వేదికగా వినిపించనున్నారు. రేపు (శుక్రవారం) ఉదయం 7:45 గంటలకు మౌంట్ రుదుగైరాపై తెలంగాణ వేడుకలను నిర్వహిస్తారు.