హాఫ్ సెంచ‌రీలతో రోహిత్‌, ధావన్ దూకుడు

పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న చాంపియ‌న్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌శ‌ర్మ, శిఖర్‌ ధావన్ హాఫ్ సెంచ‌రీలు చేశారు. మొద‌ట్లో జాగ్ర‌త్త‌గా ఆడుతూ.. మెల్ల‌గా వేగం పెంచిన భారత బ్యాట్స్ మెన్.. పాక్ బౌల‌ర్ల‌తో ఆడుకుంటున్నారు. స్పిన్న‌ర్ షాదాబ్ బౌలింగ్‌లో సిక్స‌ర్‌తో  రోహిత్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. మ‌రో ఓపెన‌ర్ ధావ‌న్ కూడా జాగ్ర‌త్త‌గా ఆడి ఆర్థ శతకం చేశాడు. టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. వికెట్ తీయ‌డానికి పాక్ బౌల‌ర్లు శ్ర‌మిస్తున్నారు. 20 ఓవర్లలో భారత్ 110 పరుగులు చేసింది.