స్వచ్ఛ భారత్ ను బేఖాతరు చేసిన కేంద్ర మంత్రి

స్వచ్ఛ భారత్  పేరుతో ఓ వైపు కేంద్రం జనంతో రోడ్లను ఊడ్పిస్తుంటే.. కేంద్ర మంత్రులు మాత్రం తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలువాల్సిన కేంద్ర మంత్రే.. బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్  సింగ్‌ రోడ్డు పక్కనే మూత్ర విసర్జన  చేస్తూ కెమెరాకు చిక్కారు.  ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్  మీడియాలో  వైరల్ గా మారాయి. కేంద్ర మంత్రి తీరుపై నెటిజన్లు ఫైర్‌  అవుతున్నారు.