ఎమ్మెల్యేల కొనుగోలుపై దద్దరిల్లిన తమిళ అసెంబ్లీ

ఎమ్మెల్యేల అవినీతి  భాగోతంపై తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లింది. విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ బయపటపడ్డ స్టింగ్‌ ఆపరేషన్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. సీబీఐ విచారణకు ఆదేశాలివ్వాలంటూ సభలో డీఎంకే ఆందోళన చేసింది. ఈ గందరగోళం మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. దాంతో అసెంబ్లీ ముందు బైటాయించిన డీఎంకే ఎమ్మెల్యేలు.. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్టాలిన్‌తో  పాటు పలువురు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.