స్కూలు ముందు పేలుడు, ఏడుగురు చిన్నారుల దుర్మరణం

చైనా జియాంగ్జు ప్రావిన్స్‌ లోని ఓ స్కూల్ గేట్ దగ్గర భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 59 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.  స్కూల్‌ ముగించుకుని పిల్లలు బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో చిన్నారులు, వారి తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అలర్టయిన భద్రతా సిబ్బంది.. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నారు.