సోషల్ మీడియాలో డీజే.. పోలీసులకు ఫిర్యాదు

దువ్వాడ జగన్నాథం-డీజే సినిమా డైరెక్టర్ హరీశ్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాతో పాటు ఫేస్ బుక్ లో తమ సినిమాను అప్ లోడ్ చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే డీజే సినిమా పైరసీ చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని హరీశ్ శంకర్, దిల్ రాజు విజ్ఞప్తి చేశారు.