సోదరుడిపై దీప సంచలన ఆరోపణలు

జయలలిత మేనల్లుడు దీపక్‌ పై సంచలన ఆరోపణలు చేశారు ఆమె మేనకోడలు దీప. తన సోదరుడు శశికళతో చేతులు కలిపి జయను చంపేందుకు యత్నించారని ఆరోపించారు. వెంటనే దీపక్‌ ను అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనూహ్యంగా చెన్నైలోని జయ నివాస ప్రాంతం పోయెస్ గార్డెన్ దగ్గర ప్రత్యక్షమైన దీప.. జయ ఇల్లు వేద నిలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారితో గొడవకు దిగారు. జయలలిత ఆస్తులు తనకే దక్కాలంటూ హంగామా చేశారు. ఇంట్లోకి వెళ్లేవరకు ఇక్కడి నుంచి కదలనని భీష్మించారు.