సెరెనాపై మెకన్రో వివాదాస్పద వ్యాఖ్యలు 

టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ (23) సాధించిన అమెరికా తార సెరెనా విలియమ్స్‌పై టెన్నిస్ దిగ్గజం జాన్ మెకన్రో నోరు పారేసుకున్నాడు. పురుషుల టెన్నిస్‌లో ఆడినైట్లెతే సెరెనా 700 ర్యాంక్‌లో ఉంటుందనీ.. 701వ ర్యాంకర్ కూడా ఆమెను సులువుగా ఓడిస్తాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సెరెనా అద్భుతమైన ప్లేయర్ కాదు అని నేను అనడం లేదు. పురుషుల టెన్నిస్ సర్క్యూట్‌లో ఆమె పోటీపడితే 700 ర్యాంక్‌లో ఉంటుంది. పురుషులతో మహిళలకు పోటీ ఊహాజనితమైనా.. వాళ్లతో ఆడితే సెరెనా కథ మరోలా ఉంటుందని 58ఏండ్ల మెకన్రో అన్నాడు.