సృష్టి సీడ్స్ గోదాంపై పోలీసుల దాడి

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తొర్రూర్ గ్రామంలో ఉన్న సృష్టి విత్తనాల గోదాంపై పోలీసులు దాడి చేశారు. యజమాని జానకిరామ్ ని అదుపులోకి తీసుకుని, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల కోసం విత్తనాలను ల్యాబ్ కు పంపించారు. సంస్థ యజమాని జానకిరామ్ పై క్రిమినల్ కేస్ నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.