సృజనాత్మకతను పెంచే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్

కరీంనగర్‌ లో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన స్కిల్ డెవలప్‌ మెంట్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ వినోద్ పాల్గొన్నారు. అనంతరం టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ 42 రోజుల వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి వినోద్ హాజరయ్యారు. చిన్నారుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించేలా పాఠశాలల్లో ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లు ఉండాల్సిన అవసరముందన్నారు. గురుకుల పాఠశాలల్లో క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్ల భర్తీకి ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ జారీచేసినట్లు ఆయన గుర్తుచేశారు.

ఎంపీ వినోద్‌ తోపాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి,  జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.