సుష్మకు మోడీ ప్రశంసలు

కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ ను పొగడ్తలతో ముంచెత్తారు ప్రధాని మోడీ. ఆపదలో ఉన్నామంటూ అర్ధరాత్రి ట్వీట్‌ చేసినా.. 15 నిమిషాల్లో సుష్మాస్వరాజ్‌  అవసరమైన చర్యలు తీసుకుంటారని ప్రశంసించారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ.. వర్జీనియాలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. సోషల్‌ మీడియాతో కూడా సేవలందించొచ్చని సుష్మాస్వరాజ్‌ నిరూపించారని మెచ్చుకున్నారు. భారతీయులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే.. ప్రపంచంలో ఏ మూలనున్నా వారికి సుష్మా సాయం చేస్తారని చెప్పారు.