సీఎం కేసీఆర్ వెలుగులు నింపిన ప్రత్యూష

తండ్రి, సవతితల్లి చేతిలో చిత్రహింసలకు గురై సీఎం కేసీఆర్‌ చొరవతో బయటపడ్డ ప్రత్యూష ఇప్పుడు నర్సింగ్‌ కోర్సు చేస్తోంది. ప్రత్యూష నర్సింగ్‌ కోర్సు చేస్తోందన్న సమాచారాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌ కు వివరించగా ఆనందం వ్యక్తం చేశారు. గతేడాది సవతితల్లి చేతిలో హింసకు గురై గాయపడి ఆసుపత్రి పాలైన ప్రత్యూషను సీఎం కేసీఆర్‌ అక్కున చేర్చుకున్నారు. ఇంటికి పిలిపించి భోజనం పెట్టడంతోపాటు ఆమెకు కోరుకున్న సాయం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరుఫునే విద్య, వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే వ్యక్తిగతంగా కొంత ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆమె కోరుకున్న విధంగా చదివిస్తున్నారు.