సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదర, సోదరీమణులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. మత సామరస్యానికి, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన తెలంగాణలో పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో సంతోషం తీసుకొచ్చిన సందర్భంగా ప్రజలంతా గంగా, జమున తెహజీబ్ సంస్కృతి ప్రతిబింబించేలా ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్న సందర్భాన.. శాంతి, సోదరభావాన్ని, ప్రేమ తత్వాన్ని పెంపొందించే ఈ రంజాన్ పండుగ సంబురాలను ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.