సీఎం కేసీఆర్ కొండపాక పర్యటన వివరాలు

గొల్ల, కురుమల జీవితాల్లో కొత్త వెలుగులకు నేడే అంకురార్పణ జరగనుంది. గొర్రెల పంపిణీ పథకానికి నేడే శ్రీకారం చుడుతున్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని సిద్దిపేట జిల్లా కొండపాకలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు గొర్రెల పంపిణీ చేయనున్నారు.

సీఎం కేసీఆర్ కార్యక్రమం పర్యటన వివరాలు

ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి బస్సులో బయలుదేరుతారు.
* 11.30 గంటలకు సిద్దిపేట జిల్లా కొండపాకకు చేరుకుంటారు.
* 11.30 గంటల నుంచి 11.45 వరకు లబ్ధిదారులతో ముఖాముఖి.
* 11.45 గంటల నుంచి 11.50 మధ్య డోలు వాయించి పథకాన్ని ప్రారంభిస్తారు.
* 11.50 గంటల నుంచి 12.10 వరకు మంత్రుల ప్రసంగం.
* 12.10 గంటల నుంచి 12.55 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
* మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం చేస్తారు.
* 1.30 గంటలకు సిద్దిపేట జిల్లా కొండపాక నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
* మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్‌కు చేరుకుంటారు.