సీఎం కేసీఆర్ కు జైట్లీ కృతజ్ఞతలు

జీఎస్టీ బిల్లు ఆమోదానికి సహరించినందుకు సీఎం కేసీఆర్ కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ కు అరుణ్ జైట్లీ లేఖ రాశారు. జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీని అమలు చేస్తున్నట్లు కూడా తెలిపారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహకారం వల్లనే జీఎస్టీ బిల్లు తేగలిగామని అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. జీఎస్టీపై రాష్ట్రంలోని ఎంపిలు, ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు.

మరోవైపు, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల కోసం అటవీభూమిని ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. హర్షవర్థన్ తో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరుఫున, వ్యక్తిగతంగా తన తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీకి వచ్చినప్పుడు స్వయంగా కలుస్తానని సిఎం చెప్పారు.