సీఎం కేసీఆర్ కు ఆశా వర్కర్ల కృతజ్ఞతలు

ఆశా వర్కర్లు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసి చైర్మన్ బేగ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌, జడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు జి.రాంబాబుతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లు భారీగా తరలివచ్చారు.