సీఆర్పీఎఫ్ వాహనంపై కాల్పులు, ఎస్ఐ మృతి

జమ్మూకాశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌ లో పెట్రోలింగ్‌  నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ వాహనంపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బలగాలు అలర్టయ్యేలోపే ఉగ్రవాదులు అక్కడే ఉన్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ లోకి చొరబడ్డారు. ఉగ్రవాదుల కోసం జవాన్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉగ్రదాడితో శ్రీనగర్‌-జమ్మూ హైవేను తాత్కాలికంగా మూసేశారు.